కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికకు సీఎం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు కార్పొరేషన్లకు చైర్మన్ల ఎంపిక ప్రక్రియకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిష్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా గుంటూరుకు చెందిన మద్దిరాల జోసఫ్ ఇమ్మానుయేలు, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌గా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, పద్మశ్రీ ప్రొఫెసర్ కొలక లూరి ఇనాక్, రాష్ట్ర సంగీత, నృత్య అకాడమీ చైర్మన్‌గా ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్‌గా అనంతపురంకు చెందిన పోట్లూరి హరికృష్ణలను ఎంపిక చేస్తూ ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు త్వరలో ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.













