ఓట్ల తొలగింపు కుట్రలో ఏ 1 నిందితుడు జగన్
ఫారమ్ 7 దుర్వినియోగం వైసిపికి సిగ్గుచేటు. తప్పులు సవరించే దరఖాస్తు ఫారమ్ 7. ఎంతో బాధ్యతగా పెట్టాల్సిన దరఖాస్తు ఫారమ్ 7. తప్పులు చేయడానికి ఫారమ్ 7 వాడటం నేరం. ఫారమ్ 7 దుర్వినియోగం చేశామని జగనే ఒప్పుకున్నాడు. ఫారమ్ 7 దరఖాస్తులు 13లక్షలు పంపుతారా..? బెంగళూరు, హైదరాబాద్ నుంచే ఫారమ్ 7 కుట్రలు. ఓట్లు పోయిన వాళ్లంతా జగన్ ను నిలదీయాలి. ఓటు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలి. 2004-09మధ్య రౌడీయిజంతో రాష్ట్రానికి అప్రదిష్ట. ఆ 5ఏళ్లలో ఫాక్షనిస్టులు పేట్రేగిపోయారు. రాష్ట్రంలో ఫాక్షనిజాన్ని కంట్రోల్ చేశాను. రౌడీయిజం రాష్ట్రంలో లేకుండా చేశాను. బాధ్యతా రహితంగా వైసిపి వ్యవహరిస్తోంది. అచ్చోసిన ఆంబోతుల పనిపడతాను. ఆంబోతుల కట్టడి ఎలా చేయాలో నాకు తెలుసు. తప్పులు చేయడం, శిక్షలు అనుభవించడం జగన్ కు అలవాటు. తప్పులు చేసేవాళ్లు, నేరగాళ్లకే వైసిపిలో చోటు. వైసిపిలో ఉంటే ఎవరైనా తప్పులు చేయాల్సిందే. జగన్ వల్ల ఎందరో కేసుల్లో చిక్కుకున్నారు. జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. నేరాలు, ఘోరాలు చేసే ఆలోచనలు వైసిపి చేస్తోంది. అభివృద్ది, సంక్షేమం ఆలోచనలు తెలుగుదేశం చేస్తుంది.













