23న ప్రజలు మోదీని తిరస్కరించడం ఖాయం : చంద్రబాబు
ఈ నెల 23వ తేదీన దేశ ప్రజలు ప్రధానిగా నరేంద్ర మోదీని తిరస్కరించడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో సృష్టం చేశారు. నరేంద్ర మోదీ బృందానికి పరాజయం ఖాయమన్నారు. మా పోరాటం భారత ఎన్నికల సంఘంపై కాదు.. అధికారుల వివక్ష, పక్షపాత ధోరణిపైనే అన్నారు. మోదీ, అమిత్ షాపై ఈసీ తీరుకు నిరసనగానే మా పోరాటం అన్నారు. రాజకీయ లాభం కోసం ఎప్పుడో చనిపోయిన నాయకులపై మాట్లాడటం మంచిది కాదన్నారు. రాజకీయ లాభం కోసం రక్షణ శాఖ, సైన్యాన్నీ వాడుకుంటారన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారన్నారు. ఎన్నికల షెడ్యూల్ కు ఈసీ 73 రోజుల సమయం తీసుకుందన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు మరో ఆరు రోజులు తీసుకోవడానికి అభ్యంతరమొందుకని ప్రశ్నించారు. వీవీప్యాట్ స్లిప్పులపై ఈసీని ప్రతిపక్షాలు అడిగితే మోదీ ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు.













