జస్టిస్ లిసా గిల్ కు సీఎం చంద్రబాబు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లిసా గిల్ (Justice Lisa Gill) కు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అభినందనలు తెలియజేశారు. ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా ఈ నియామకం ఓ చారిత్రాత్మక మైలురాయి అని కొనియాడారు. న్యాయ రంగంలో జస్టిస్ లిసా గిల్ అత్యుత్తమ సేవలందించారని, సివిల్ (Civil), క్రిమినల్ (criminal), రాజ్యాంగపరమైన అంశాల్లో విశేష అనుభవం కలిగిన గిల్ నేతృత్వంలో చట్టబద్ధమైన పాలన మరింత బలోపేతమవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె పదవీకాలం విజయవంతంగా, స్ఫూర్తిదాయకంగా సాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ లిసా గిల్ నియమితులైన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








