విదేశాల్లో ప్రత్యేక ప్రతినిధులను నియమించిన ఏపీ ప్రభుత్వం
విదేశాల్లో ప్రత్యేక అనుసంధానకర్త, ప్రత్యేక ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. రాష్ట్రం లో పెట్టుబడుల కోసం ఉత్తర అమెరికా ప్రధాన అనుసంధానకర్తగా సతీష్ మండువ (Satish Manduva) నియమితులయ్యారు. మధ్య ప్రాచ్య, తూర్పు దేశాల ప్రత్యేక ప్రతినిధిగా రాధాకృష్ణ రావి (Radhakrishna Ravi), ఐరోపా ప్రత్యేక ప్రతినిధిగా జయకుమార్ గుంటుపల్లి (Jayakumar Guntupalli), మిగిలిన దేశాలకు ప్రత్యేక ప్రతినిధిగా శ్రీనివాస్ పల్లాపోతు (Srinivas Pallapothu)ను ప్రభుత్వం నియమించింది.








