ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ (Justice Lisa Gill) నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) ను జారీ చేసింది. ఈ నియామకం ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ (Dheeraj Singh Thakur) ఈనెల 24న పదవీ విరమణ చేయనున్నారు. 25 నుంచి జస్టిస్ లీసాగిల్ హైకోర్టు సీజేగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈనెల 25న జస్టిస్ లీసాగిల్తో సీజేగా ప్రమాణం చేయించనున్నారు. రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ చరిత్రకెక్కనున్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








