ఢిల్లీలో లాఠీఛార్జిని ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
బాధితులను ఫోన్ లో పరామర్శించిన సీఎం చంద్రబాబు
గాయపడిన వెంకట్ కు ఈ రోజు ఉదయాన్నే సీఎం ఫోన్ కాల్
కేంద్రం నిరంకుశ పోకడలను ఖండించిన ముఖ్యమంత్రి
హోదా సాధన సమితి ప్రతినిధులపై ఢిల్లీ పోలీసుల దాడి గర్హనీయం: ముఖ్యమంత్రి
శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిపై లాఠీచార్జ్ అమానుషం
ఒకవైపు లోక్ సభలో టిడిపి ఎంపిల సస్పెన్షన్. మరోవైపు హోదా సాధన సమితి ప్రతినిధులపై లాఠీచార్జ్
కేంద్రం నిరంకుశ పోకడలకు ప్రత్యక్ష నిదర్శనం.
అటు ఎంపిలు రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఇటు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయినా కేంద్రంలో బిజెపి నేతలు నిర్లక్ష్యం చేస్తున్నారు.
దీనికి తగిన మూల్యం బిజెపి చెల్లించక తప్పదు. బిజెపితో కుమ్మక్కైన పార్టీలకు గుణపాఠం తప్పదు













