Amaravathi: బహుభాషలు నేర్చుకోవడమే ఉత్తమం.. కేంద్రానికి చంద్రబాబు, పవన్ మద్దతు…
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా కేంద్రం అమలు చేస్తున్న త్రిభాషా విధానంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మాతృభాషను కచ్చితంగా అమలు చేస్తున్న తమిళనాడు, కర్నాటక లాంటి రాష్ట్రాలు.. ఈవిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది తమ భాషపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నాయి. తమిళనాడు లో అయితే బడ్జెట్ సమావేశంలో రూపాయి సింబల్ ని కూడా హిందీ ని తొలగించి తమిళం పెట్టారు. ఇది ఇప్పుడు నేషనల్ వైడ్ గా పెద్ద చర్చకు దారి తీసింది.
దీనిపై తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. పిఠాపురం సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్(pavan) కల్యాణ్.. చాలా టాపిక్స్ పై మాట్లాడారు.‘భాషలను ద్వేషించడం బాధాకరం. హిందీ ని అంత ద్వేషించేవాళ్ళు, తమిళ సినిమాలను ఎందుకు హిందీ లో డబ్ చేసి డబ్బులు పోగు చేసుకుంటున్నారు?..మీకు వ్యాపారాల కోసం మాత్రం హిందీ కావాలి, చదువుకోవడానికి మాత్రం వద్దు’ అంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా విభిన్నమైన అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) కూడా పవన్ కళ్యాణ్ తరహాలోనే మాట్లాడారు.‘భాషలపై ద్వేషం తగదు. హిందీ మన జాతీయ భాష. మన మాతృ భాషను నేర్చుకుంటూనే హిందీ భాషను కూడా నేర్చుకోవాలి. కేవలం హిందీ ఒక్కటే కాదు, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు నేర్చుకోవాలి.. అప్పుడే మనం ఎక్కడికి వెళ్లినా బ్రతకగలం, ఇప్పుడు నేను ఢిల్లీ కి వెళ్తే అనర్గళంగా హిందీ మాట్లాడే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి అందరికీ రావాలి’ అన్నారు చంద్రబాబు
ఇప్పుడు ఏపీలో అధికార కూటమి పార్టీలు.. జాతీయ విద్యావిదానానికి జైకొట్టాయి. ఇక విపక్ష పార్టీ అయిన వైసీపీ(ycp) నిర్ణయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. ఇంతవరకూ అధికార ఎన్డీఏకు,విపక్ష ఇండియా కూటమికి జగన్(jagan) సమానదూరం పాటిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏదోపక్షాన నిలవాల్సిన సమయం ఆసన్న మైంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.













