పురందరేశ్వరి మా కుటుంబ సభ్యురాలు కానీ.. చంద్రబాబు వైరల్ స్టేట్మెంట్..
ఎన్నికల దగ్గర పడుతున్న ఈ టైంలో కొందరు లేనిపోని చుట్టాలు కలుపుకుంటుంటే మరికొందరు ఉన్న వాటిని కూడా పక్కన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యురాలు.. నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయిన దగ్గుబాటి పురందరేశ్వరిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాని ఉపయోగించి కొంతమంది ఎన్నికల సమయంలో దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటిదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందరేశ్వరి రాజీనామా లేఖ. ఇది ఫేక్ అని తేల్చి చెప్పిన బీజేపీ నేతలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందిగా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది కేవలం వైసీపీ అండ చూసుకొని సోషల్ మీడియా బ్యాచ్ పని అని వారు భావిస్తున్నారు. ఈ విషయంపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. పురందరేశ్వరి రాజీనామా చేశారు అని ఫేక్ లెటర్ సృష్టించినట్లుగానే తనది టెంపరరీ పొత్తు అన్న ప్రచారం కూడా చేశారు అని బాబు మండి పడ్డారు. పురందరేశ్వరి మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు కానీ ఆమె 30 ఏళ్లుగా బయట ఎన్నో రాజకీయ పార్టీల తో పని చేశారు. అలాంటిది ఆమెపై ఇలా ఫేక్ వార్తలు తీసుకురావడం చాలా బాధాకరం అని చంద్రబాబు అన్నారు.













