ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దం : చంద్రబాబు నాయుడు
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థులను ముందే ప్రకటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా క్యాడర్ సిద్ధంగా ఉండాలని సూచించారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో గెలుపు ఏకపక్షం కావాలని ఆకాంక్షించారు. మళ్లీ టీడీపీ రావాలి అనే నినాదం మార్మోగాలని, మళ్లీ రాకుంటే అభివృద్ధి ఆగిపోయి, పేదల సంక్షేమం నిలిచిపోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలే మన టార్గెట్. ప్రభుత్వంపై సానుకూలత ఉంది. మరింత సానుకూలత రావాలి. వారంలోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి అని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు.













