అందుకే పొత్తులు పెట్టుకున్నాం.. చంద్రబాబు క్లారిటీ..
ఆంధ్రాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి పార్టీ తమ క్యాండిడేట్స్ జాబితాలు ప్రకటించే పనిలో నిమగ్నమై ఉంది. రీసెంట్ గా టీడీపీ 94 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండవ జాబితా విడుదల చేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. నిజానికి బీజేపీ తో పొత్తు విషయంపై స్పష్టత లేకపోవడంతో మొదట కొందరినే ప్రకటించడం జరిగింది. మంతనాలు పూర్తయి పొత్తు కుదిరిన తర్వాత.. బీజేపీ ,జనసేనకు కేటాయించాల్సిన సీట్ల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు రెండవ జాబితాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు గెలవాలని.. రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో మాత్రమే పొత్తులు పెట్టుకున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు . జగన్ పరిపాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది.. ఇప్పుడు తిరిగి ప్రగతి రావాలి అంటే కేంద్రం లో పటిష్టతను ఏర్పరచుకున్న బీజేపీ అండ ఎంతో అవసరం. ఇటు పవన్ తో పొత్తు పెట్టుకోకపోతే ఓట్లు చీలే అవకాశం ఉంది. ఇది కేవలం ప్రజల హితం కోసం కుదుర్చుకున్న పోతే తప్ప.. రాజ్యాధికారం కోసం చేసుకున్న పొత్తు మాత్రం కాదు అని చంద్రబాబు అన్నారు.













