అమెరికా సంస్థతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం
అమెరికా అంతరిక్ష వ్యవహారాల సంస్థతో (యునూసా) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థికాభివృద్ధి మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణ కిషోర్, యునూసా సంస్థ అధ్యక్షులు మిలింద్ పింప్రికర్లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తారు. దీని ద్వారా ఆ సంస్థ అంతరిక్ష శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన రాష్ట్రంలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనుంది. అంతరిక్ష పరిశోధనలు, సాంకేతిక సదుపాయాలలో నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు.













