శ్రీలక్ష్మికి నాన్‌బెయిలబుల్ వారెంట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. ఐఏఎస్ శ్రీలక్ష్మీపై సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాల్మియా కేసు విచారణకు రానందుకు శ్రీలక్ష్మీకి ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. పెన్నా కేసులో సీబీఐ కోర్టుకు జి.వెంకట్రామిరెడ్డి హాజరైయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిపై కోర్టు ఎన్బీడబ్ల్యూ రీకాల్ చేసింది. వాన్‌పిక్ కేసులో మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి హాజరు కాలేదు. మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి లాయర్లు రాకుంటే ఉత్తర్వులు ఇస్తామని హెచ్చరించింది. జగన్, విజయసాయి పిటిషన్లపై కౌంటర్లకు సీబీఐ, ఈడీ గడువు కోరింది. వాన్‌పిక్, దాల్మియా కేసుల విచారణ ఈ నెల 30కి కోర్టు వాయిదా వేసింది. అలాగే జగతి పబ్లికేషన్స్, పెన్నా సిమెంట్స్ కేసుల విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది.













