ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ : బుద్దా డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భయంకరంగా పెరిగిపోతున్న తరుణంలో రాష్ట్రంలో వైద్య పరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సిఎం జగన్‌కి ఆదివారం ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కళ్యాణ మండపాలు, వంటివన్నీ క్వారంటైన్ సెంటర్లుగా మార్చాలన్నారు. కరోనా బాధితులకు ప్రభుత్వం ఇస్తున్న రూ.2వేల ఆర్ధిక సాయం కొనసాగించాలన్నారు. అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలన్నారు.













