ఉపఎన్నికలో బీజేపీని గెలిపిస్తే తిరుపతి అభివృద్ధి
ఉపఎన్నికలో బీజేపీని గెలిపిస్తే తిరుపతి అభివృద్ధి చెందుతుందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి హోదా పేరుతో కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదాను వైసీపీ, టీడీపీలు రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. పుదుచ్చేరికి హోదా ఇచ్చారంటూ బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రధానమంత్రి అయినా ఏపీకి హోదా ఇవ్వలేరని అన్నారు. ఎందుకంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోదా కుదరదని ఆర్థిక సంఘం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విభజన చట్టంలో ఉన్నవాటితో పాటు లేనివి కూడా ఆంధప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యేల తీరుతో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని అన్నారు.













