Daggubati Purandeswari: చిన్నమ్మకు పెద్ద బాధ్యతలు అప్పగించే ప్లాన్ లో బీజేపీ పెద్దలు..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టంగా ఉంది. మరి ముఖ్యంగా గత కొద్దికాలంగా బీజేపీ (BJP) లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక త్వరలో ఢిల్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి.. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు చిన్నమ్మకు గట్టి బాధ్యత అప్పగించడానికి ఫిక్స్ అవుతున్నారని టాక్ నడుస్తోంది. దీంతో ప్రస్తుతం పురందరేశ్వరి పేరు బీజేపీ వర్గాలలో హల్చల్ చేస్తోంది.
2014 ఆంధ్ర రాష్ట్ర విభజన అనంతరం.. పురందరేశ్వరి( Purandeswari ) బీజేపీ పార్టీ లో చేరారు. అనంతరం రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక తాజాగా రాజమండ్రి నుంచి పోటీలోకి దిగిన పురందరేశ్వరి ఘనవిజయం అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి దక్కుతుంది అని అందరూ భావించారు.. కానీ కేంద్రం మాత్రం దీనికి ఒప్పుకోలేదు. అయితే దీని వెనక ముఖ్య ఉద్దేశం ఆమెకు మరింత పెద్ద పదవి కట్టబెట్టాలి అనే ఆలోచన అని అప్పట్లో వార్తలు వచ్చాయి..
మరోపక్క ప్రస్తుతం కేంద్ర సారధిగా జేపీ నడ్డా (J.P.Nada) వ్యవహరిస్తున్నారు. అయితే పెరుగుతున్న పని ఒత్తిడి, ఎక్కువ కాలం ఒకరికే పదవి కట్టబెట్టడం సరికాదు అన్న బీజేపీ పెద్దల నిర్ణయాల కారణంగా.. నడ్డాను మార్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అయితే ఈ పొజిషన్ కి పురందరేశ్వరి కరెక్ట్ గా సెట్ అవుతుంది అని బీజేపీ పెద్దల ఉద్దేశం అట. పైగా ఎక్కువ మహిళ ఓటు బ్యాంక్ తమవైపు మోగ్గు చూపాలి అనే ఉద్దేశంతో పురందరేశ్వరికి ఈ పదవి ఇచ్చే అవకాశం ఉంది అని టాక్ నడుస్తోంది.
దీనితో పాటుగా ఏపీ, తెలంగాణ, తమిళనాట రాజకీయాలలో మంచి పలుకుబడి ఉన్న నాయకురాలు కావడం తో పురందరేశ్వరి బీజేపీ దక్షిణాది రాష్ట్రాల విస్తీర్ణకు బాగా ఉపయోగపడుతుంది. తండ్రి వారసత్వం పునికి పుచ్చుకున్న ఆమె అనర్ఘలంగా మాట్లాడడంలో.. ఎవరినైనా కన్విన్స్ చేయడంలో దిట్ట. ఇక బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నిర్వహించడం ఆంధ్రావాసులకు కొత్తేమీ కాదు. గతంలో ముప్పవరపు వెంకయ్య నాయుడు( Venkaiah Naidu) , ఉమ్మడి ఆంధ్రకు చెందిన బంగారు లక్ష్మణ్..బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టిన వారే. బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya)కూడా కొన్ని నెలల పాటు ఈ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అయితే ఆ పదవిలో ఒక మహిళ.. అది కూడా మన రాష్ట్రం నుంచి వెళ్లడం తొలిసారి అని చెప్పవచ్చు.













