తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తిరుమల లోని శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి రబ్రిదేవి, కుమారుడు తేజస్వి యాదవ్, కుటుంబ సభ్యులు శ్రీవారి దర్శనంలో పాల్గొన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకు ముందు తిరుమలకు చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం టీటీడీ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామి వారి దర్శనం అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.













