షర్మిలకు కౌంటర్ గా భారతి.. హీట్ ఎక్కుతున్న కడప..
కుటుంబ రాజకీయం కాస్త గడప దాటి కడప రాజకీయంగా మారింది. వైయస్సార్ కుటుంబంలో ఏర్పడ్డ భారీ చీలిక కారణంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అన్నా చెల్లెల మధ్య పోరు కాస్త ఇరు పార్టీల మధ్య పోరుగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కాంగ్రెస్ ఏపీ చీఫ్ గా వ్యవహరిస్తూ అన్న గురించి చెడుగా ప్రచారం చేస్తుంది. దీనితో పాటుగా అవినాష్ రెడ్డికి ఆపోజిట్ గా కడప ఎంపీగా ఆమె నిలబడింది. ఇక సునీతను పక్కన పెట్టుకొని రాజశేఖర్ రెడ్డి బిడ్డను.. హంతకుడికి ఓటు వేయకండి అంటూ అవినాష్ రెడ్డిని కార్నర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో పులివెందులలో ఎవరికి ఓటు వేయాలి అని సందిగ్ధ పరిస్థితి నెలకొంది. దీంతో పరిస్థితి చేయి దాటిపోకూడదు అనే ఉద్దేశంతో జగన్ సతీమణి భారతి రంగంలోకి దిగుతున్నారు. జగన్ ఎంతసేపు మాట్లాడినా తన చెల్లి చంద్రబాబు ట్రాక్‌లో పడింది అని మాత్రమే అనగలుగుతున్నారు కానీ అంతకుమించి కామెంట్ చేయలేకపోతున్నారు. మరోపక్క షర్మిల జగన్ కి ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా అన్ని వైపుల నుంచి ఎదురు దాడి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కడప మొత్తం వైసీపీ తరఫున ప్రచారం చేయడానికి భారతి పూనుకున్నారు. ఇప్పటివరకు జగన్ పై సునీత, షర్మిల చేసిన విమర్శలకు వైసీపీ తరఫునుంచి పెద్ద కౌంటర్లు రాలేదు. మరి ఇప్పుడు భారతి రంగంలోకి దిగుతోంది కాబట్టి వైసీపీ నేతలు ఆమె నుంచి దీటైన సమాధానాలే ఆశిస్తున్నారు.













