పులివెందులపై పరోక్ష ఎన్నికలతో పట్టు సాధిస్తున్న టిడిపి!
పులివెందుల అనగానే మనకు వైయస్ కుటుంబం గుర్తుకొస్తుంది. ఆ ప్రాంతం వైయస్ ఫ్యామిలీ కంచుకోటగా గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని దశాబ్దాలుగా పులివెందుల, కడప ప్రాంతాలను వైయస్ ఫ్యామిలీ ఏలుతోంది. అయితే వైయస్ ఫ్యామిలీకి అప్పుడప్పుడు కొన్ని పరాజయాలు కూడా ఎదురవుతున్నాయి. దీంతో టిడిపి సంతృప్తి చెందాల్సిన ఏర్పడింది. అయితే ఎన్నికల్లో టిడిపి ఎప్పుడు గెలుపొందలేదు. ఎమ్మెల్సీ లాంటి పరోక్ష ఎన్నికల్లో మాత్రమే టిడిపి విజయం సాధిస్తూ వైయస్ ఫ్యామిలీకి చెక్ పెడుతుంది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేత. అలాగే పులివెందులలో ఆయన సత్తా ఏంటో అందరికీ తెలుసు. అలాంటి చోట టిడిపికి అభ్యర్థి దొరకని పరిస్థితి. అలాంటి సమయంలో సతీష్ రెడ్డి టిడిపికి ఈ విధంగా మారారు. పులివెందులలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కి వ్యతిరేకంగా సతీష్ రెడ్డి పలుమార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన సేవలను గుర్తించిన టిడిపి ఎమ్మెల్సీ ని చేసి మండలి డిప్యూటీ చైర్మన్ గా కూడా బాధ్యతలు అప్పగించింది. దీంతో పులివెందుల ప్రాంతంలో టిడిపికి వాయిస్ వినిపించే అవకాశం కలిగింది.
సతీష్ రెడ్డి ప్రభావం తగ్గుతున్న సమయంలో స్థానంలో బీటెక్ రవిని టిడిపి ముందుకు తీసుకొచ్చింది. బీటెక్ రవి ద్వారా తెలుగుదేశం పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం లేకపోయినా బరిలోకి దింపి అనూహ్య విజయం సాధించింది. అది కూడా వైయస్ వివేకానంద రెడ్డి పై గెలుపొందడం టిడిపికి మరింత శక్తినిచ్చినట్లయింది. అయితే బీటెక్ రవి పదవీకాలం ముగిస్తుండడంతో తర్వాత ఎవరు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని బరిలోకి దింపింది. పట్టభద్రుల స్థానంలో అనూహ్యంగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించడంతో టిడిపి తన పట్టును నిలుపుకునేందుకు అవకాశం ఏర్పడింది. పులివెందుల ప్రాంతానికి చెందిన భూమి రెడ్డి టిడిపికి ఎంతోకాలంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడంతో టిడిపికి పులివెందుల ఏరియాలో మరో లీడర్ దొరికారు. పులివెందుల ఏరియాలో వైయస్ కుటుంబాన్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అలాంటిది భూమిరెడ్డి సామాజికంగా, ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో మున్ముందు వైయస్ ఫ్యామిలీని సైతం ఎదుర్కోగలమని టిడిపి చెప్తోంది.













