ఏపీఐఐసీ చైర్మన్ సంచలన నిర్ణయం..ఇకపై
ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జీతం తీసుకోకుండా పనిచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ నుంచి తన వేతనం రూ.65 వేలు తీసుకోనంటూ ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాదికి చైర్మన్ మొట్టు గోవిందరెడ్డి లేఖ రాశారు. సీఎం తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన పెద్ద బాధ్యతలను ప్రజా సేవగా మాత్రమే నిర్వర్తించాలన్నదే తన లక్ష్యమన్నారు. గత ఏడాది జూలైలో ఏపీఐఐసీ చైర్మన్ ఆయన్ని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదవిని బాధ్యతగా మాత్రమే చూస్తానన్నారు.













