శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు : అనిల్ చంద్ర పునేఠ
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై రాజకీయ పార్టీల నేతలు ఫిర్యాదు చేశారని ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠ (Anil Chandra Punetha) అన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి కలెక్టర్ల (Collectors)కు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. వెంటనే పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఎస్ఈసీ (SEC) విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్ర చర్యలు ఉంటాయి. హింసాత్మక ఘటనలు జరిగితే అదనపు బలగాలను మోహరిస్తాం. నామినేషన్ (Nomination) వేసేందుకు అభ్యర్థితో కలిపి ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రతి నామినేషన్ సెంటర్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. నామినేష్ల వేళ అధికారుల నిర్లక్ష్యం ఉంటే బదిలీ లేదా సస్పెండ్ చేస్తాం అని తెలిపారు.








