కాకినాడ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’..
వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న నవరాత్రి సంబరాలు
సాయంత్రం 7 గంటల నుండి నాగమల్లి తోట జంక్షన్ లోని ‘ద్వారంపూడి ఫంక్షన్ హాల్లో వేడుకలు
దేవీ నవరాత్రుల శుభ సందర్భంగా వీ వైబ్ సంస్థ సహకారంతో ఈ భారీ దాండియా ఈవెంట్ ప్లాన్ చేసినట్లు వేగా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా వెల్లడించారు. కళలు, సంస్కృతి, ఆప్యాయతలకు నిలయమైన ‘పెన్షన్ల పట్నం.. కాజాల పట్నం’ మన కాకినాడ నగర కీర్తికిరీటంలో మరో సరికొత్త వేడుక చేరనుంది. దేవీ శరన్నవరాత్రి పర్వదినాల వేళ, నగర అస్తిత్వాన్ని, కళాత్మక సంప్రదాయాలను మేళవిస్తూ ప్రముఖ లగ్జరీ జ్యువెలరీ సంస్థ ‘వేగా జ్యువెలర్స్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ ను నిర్వహించబోతోంది. అక్టోబర్ 18వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి నాగమల్లి తోట జంక్షన్ లోని ‘ద్వారంపూడి ఫంక్షన్ హాల్’ వేదికగా ఈ కోలాహలం ప్రారంభం కానుంది.
ప్రముఖుల సమక్షంలో ఈ అద్భుత సాంస్కృతిక మహోత్సవానికి కాకినాడ నగర ప్రముఖులు, గౌరవనీయులు అయిన శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు, శ్రీ పంతం వెంకటేశ్వరరావు (పంతం నానాజీ) గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నారు. వీరితో పాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేసి నవరాత్రి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
బిగ్ బాస్ ఉదయ్ మాస్టర్ టీం ప్రత్యేక ప్రదర్శనలు
సాంప్రదాయ నవరాత్రి నృత్యాలతో పాటు ఆధునిక వినోదాన్ని అందిస్తూ ఈ సాయంత్రాన్ని మరింత రసవత్తరంగా మార్చనున్నారు. బిగ్ బాస్ ఫేమ్ ఉదయ్ మాస్టర్ నేతృత్వంలోని డాన్స్ టీమ్ ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించనుంది. ఇద్దరు ప్రముఖ డీజేల (DJs) సంగీత హోరు, సంప్రదాయ పంజాబీ ధోల్ వాయిద్యాల లయబద్ధమైన దరువుల మధ్య సాంప్రదాయ దుస్తుల్లో వచ్చే యువతీయువకులు, మహిళలు దాండియా, గర్బా నృత్యాలతో కాకినాడను గుజరాత్ వీధులను తలపించేలా చేయనున్నారు.
భారతీయ సంస్కృతికి అద్దం పట్టే ఏర్పాట్లు
వచ్చిన అతిథులకు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా హారతి, తిలకంతో సాంప్రదాయ స్వాగతం పలుకుతారు. వేడుక ప్రాంగణంలో నోరూరించే ఫుడ్ స్టాల్స్, ప్రత్యేక మాక్టైల్ కౌంటర్లు, ఫేస్ పెయింటింగ్, రంగురంగుల గాజుల స్టాల్స్, సాంప్రదాయ పోటీలు ఏర్పాటు చేశారు. జ్ఞాపకాలను పదిలపరుచుకోవడానికి వీలుగా మ్యాగ్నెటిక్ ఫోటో బూత్, సెల్ఫీ పాయింట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
*కాకినాడ ప్రజలకు వేగా జ్యువెలర్స్ ఆహ్వానం*
ఈ సందర్భంగా వేగా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నవీన్ వనమ మాట్లాడుతూ.. “నవరాత్రి అనేది భక్తి, సంప్రదాయం, అందరూ కలిసి జరుపుకునే ఒక పండుగ. కాకినాడ నగర కుటుంబాలు, యువత దేవీ శరన్నవరాత్రి స్ఫూర్తిని పంచుకుంటూ మధురమైన జ్ఞాపకాలను సొంతం చేసుకునేందుకు ఈ వేదికను సిద్ధం చేశాం” అన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సుధాకర్ వనమ మాట్లాడుతూ.. “పండుగలు సమాజంలో బంధాలను బలపరుస్తాయి. కాకినాడలోని మహిళలు, యువతీయువకులు అందరూ ఈ వేడుకలో భాగస్వాములై విజయవంతం చేయాలని కోరుతున్నాం” అని పిలుపునిచ్చారు.
1989 నుండి నమ్మకానికి, నాణ్యతకు మారుపేరుగా నిలిచిన వేగా జ్యువెలర్స్, కాకినాడ నగర సంస్కృతిని గౌరవిస్తూ అందిస్తున్న ఈ ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ నగరవాసులకు ఒక మరువలేని అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.








