ఏపీలో రికార్డు స్థాయిలో కేసులు…మరణాలు…
గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న ఏపీలో… ఒకే రోజు భారీ సంఖ్యలో పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో గరిష్టంగా 1813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఇప్పటివరకూ ఏ రోజూ లేని విధంగా మరణాల సంఖ్య కూడా పెరిగింది. గడచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ తో 17 మంది మృతి చెందారు. కోవిడ్ తో కర్నూల్ లో నలుగురు, గుంటూరులో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, కృష్ణలో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, అనంత పురం, కడప, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
నమోదైన పాజిటివ్ కేసుల్లో రాష్ట్రానికి సంబంధించినవి 1775కాగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో 34 మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27235 కాగా ఇప్పటి వరకు 309 మంది కరోనా పాజిటివ్ తో మృతి చెందారు. గడచిన 24 గంటల్లో వివిధ ఆసుపత్రుల నుండి 1168 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
గడిచిన 24 గంటల్లో మొత్తం 20590 శాంపిల్స్ పరీక్ష చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 11,36,225 లక్షల శాంపిల్స్ పరీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 12533 కాగా ఇప్పటివరకు 14393 మంది కరోనా నుంచి కోలుకోనీ డిశ్చార్జ్ అయ్యారు.













