ఏపీలో ఒక్క రోజులో 18 వేలకు పైగా కేసులు.. 71 మంది

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గినట్టే కనబడుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,15,275 శాంపిల్స్ పరీక్షించగా..18,972 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనాతో 71 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,67,18,148 శాంపిల్ప్ పరీక్షించగా, 11,63,994 మందికి పాజిటివ్‍గా తేలింది. వీరిలో 10,03,935 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 8207 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,51,852 క్రియాశీల కేసులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2628 కొత్త కేసులు నమోదవ్వగా, అత్యతల్పంగా కృష్ణాలో 969 కేసులు నమోదయ్యాయి. తాజాగా తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాలో 9 మంది, అనంతపురం, కర్నూలులో ఏడుగురు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మరణించారు.