ఏపీలో కొత్త కేసులు 23,160 కేసులు…

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉద్ధ•తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,01,330 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 23,160 మందికి పాజిటివ్‍గా తేలింది. కొత్తగా 106 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 9,686 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,09,736 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 24,819 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాల్లో 17 మంది, విశాఖ, నెల్లూరులో 11 మంది, విజయనగరం, తూర్పుగోదావరిలో 9 మంది, అనంతపురం, చిత్తూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో 8 మంది, గుంటూరులో ఏడుగురు, కర్నూలులో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, కడప జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.