AP Cabinet : ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం (AP Cabinet) పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం (Quantum Computing Center) ఏర్పాటు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు (Bulk Drug Park), సరిహద్దుల విస్తరణ తదితర నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన క్యాబినెట్లో భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కొలుసు పార్థసారథి (Parthasarathi) మీడియాతో మాట్లాడుతూ హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తోట చంద్రయ్య (Chandrayya) కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం అంగీకారం తెలిపిందన్నారు.
అమరావతిలో వరల్డ్ ఎకానమీ ఫోరం నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. కుళాయి నీరు అందించేందుకు రూ.10 వేల కోట్ల రుణాల సమీకరణకు క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు ద్వారా రూ.4 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు అదనంగా 790 ఎకరాల స్థల సేకరణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ స్పేస్ పాలసీ 2025-30కి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వైసీపీ ప్రభుత్వం గ్రీన్ట్యాక్స్ను దారుణంగా పెంచింది. దాన్ని రూ.3 వేల వరకు తగ్గించాం అని తెలిపారు.













