జర్నలిస్టుల అక్రిడేషన్ లో నూతన మార్పులు…..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు చెప్పారు. జర్నలిస్టుల ప్రతినిధులు మంగళవారం ఉదయం మంత్రిని సచివాలయంలో కలిసిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1996 లో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రికేయులకు అక్రిడేషన్ సౌకర్యం కల్పించారని, 21 సంవత్సరాల అనంతరం మీడియా అక్రిడేషన్ లలో మార్పులు తీసుకు వస్తున్నామని చెప్పారు. మారుతున్న కాలానుగుణంగా మీడియాలో పనిచేస్తున్నవారు బాగా పెరిగారని, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల అందరకు అక్రిడేషన్లు అందజేస్తామన్నారు.
యూనియన్లు ప్రమేయం లేకుండా ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితుల ఆధ్వర్యంలో ఒక 3 గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని, వాటి విధి, విధానాలు తయారు చేస్తున్నారని చెప్పారు. 3 నెలల్లో న్యూ అక్రిడేషన్ జిఓ విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కమిటీలలో స్థానం కల్పిస్తామన్నారు. పుట్టగొడుగుల్లా పుట్టికివస్తున్న పత్రికలను నియంత్రించాలని కోరారు. రెగ్యులర్ గా రాని, ప్రచురణలు కాని పత్రికలకు, టీవీ ఛానళ్లుకు అక్రిడేషన్లు మంజూరు చేయుమన్నారు. త్వరలో జర్నలిస్టుల 3 బెడ్ రూమ్ గృహాల జిఓ విడుదల చేస్తామన్నారు.













