కేంద్రానికి భయపడి ఈ నిర్ణయం తీసుకోలేదు
వివాదాలతో సీబీఐ ప్రతిష్ట మసకబారినందుకే అనుమతుల్ని వెనక్కి తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిపుణులు, మేధావుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీబీఐ మంచి వ్యవస్థ అని, అయితే ఏపీలో ప్రజలు, మేధావులు, న్యాయవాదులు అందరూ చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరిగిందని, సీబీఐ కొంచెం మసకబారిందని దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని భావించి జనరల్ కన్సాల్ట్ ఇచ్చినట్లు తెలిపారు. 1946లోనే చట్టంలో సెక్షన్ 6 ప్రకారం ఇచ్చామని, అప్పుడు కొన్ని రాష్ట్రాలు ఇవ్వలేదని ఆయన తెలిపారు. దాన్ని మార్చి ఇప్పుడు 176 జీవోను తీసువచ్చామని చెప్పారు. సీబీఐని కేంద్రం రాజకీయ పావుగా వాడుకుంటోందని, దానిపై ప్రజల్లో నమ్మకం తగ్గిపోయిందని అన్నారు.













