Suryanarayana :విశ్రాంత ఐఏఎస్‌తో వద్దు.. సిట్టింగ్ జడ్డి లేదా ముగ్గురు సభ్యులతో : సూర్యనారాయణ
గత ప్రభుత్వం ఉద్యోగులను వేధించిందని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్. సూర్యనారాయణ (Suryanarayana) అన్నారు. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Abdul Nazir) ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల బకాయిలు అందాల్సి ఉందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.6,200 కోట్లు చెల్లించిందని చెప్పారు. ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. విశ్రాంత ఐఏఎస్ (Retired IAS ) తో కూడిన పీఆర్సీ వద్దు. సిట్టింగ్ జడ్డి (Sitting Juddy) లేదా ముగ్గురు సభ్యులతో పీఆర్సీ సంఘం వేయాలి. పీఆర్సీ ఇచ్చేంత వరకు ఐఆర్ ప్రకటించాలి. కనీసం ఒక్క డీఏ అయినా ప్రకటించాలి. సీపీఎస్ (CPS) అంశంపై ఓ స్పష్టత ఇవ్వాలి అని గవర్నర్‌ను కోరారు.













