అంతర్వేది రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న జగన్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రథాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ నెల 28 వరకు లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు జరగనున్నాయి. గతేడాది సెప్టెంబరు 5న అంతర్వేదిలో స్వామివారి ఊరేగింపు రథం దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.95 లక్షలతో 41 అడుగులు ఎత్తైన నూతన రథాన్ని చేయించింది. నూతన రథాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.













