రైల్వే జోన్ ఏర్పాటు చేయండి
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న మేరకు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆరు డివిజన్లు ఉన్నాయని, ఈస్టు కోస్టు రైల్వే పరిధిలో వాల్తేరు డివిజన్ (విశాఖ) ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్నాయని గుర్తు చేశారు. ఏపీలో 13 జిల్లాల పరిధిలో వాల్తేరు, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉన్నాయని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఈ నాలుగు డివిజన్లతో విశాఖ కేంద్రంగా రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటుపై సీనియర్ అధికారులతో ఏర్పడిన బృందం వివిధ అంశాలను పరిశీలించిన నివేదిక అందజేసిందని గుర్తు చేశారు.













