పార్లమెంట్ సమావేశాల చివరి రోజున ఢిల్లీలో సీఎం ధర్మపోరాట దీక్ష
ఢిల్లీలో సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష – ఏపీకి జరుగుతున్న అన్యాయంపై కేంద్రానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఒక రోజు దీక్ష – పార్లమెంట్ సమావేశాలు ముగిసే చివరి రోజున సీఎం చంద్రబాబు దీక్ష – దీక్షలో పాల్గొనున్న టీడీపీ ఎంపీలు.
దిల్లీలో దీక్ష, అన్ని పార్టీలతో చర్చించాక అమరావతి సభ తేదీ ఖరారు.
భాజపాయేతర పార్టీల నాయకులందరితో చర్చించి, వారందరికీ ఎప్పుడు అనుకూలమో తెలుసుకుని, దాన్నిబట్టి అమరావతిలో నిర్వహించే సభ తేదీని ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ నెల 31 లేదా, ఫిబ్రవరి 1న దిల్లీలో భాజపాయేతర పార్టీల సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు చెప్పారు. కోల్కతా సభ తరహాలో… భాజపాయేతర పార్టీలన్నీ అమరావతి సహా దేశవ్యాప్తంగా 10 సభలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలిపారు.













