సిఎం చంద్రబాబు విజన్ అద్భుతం : ఈశ్వరన్
అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అన్నారు. అమరావతిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ సర్కార్‌తో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి అభివృద్దిలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ప్రశంసనీయం అని అన్నారు. అమరావతి ప్రాంతాన్ని ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఏడీపీతో కలిసి కృష్ణా తీరంలో 6.84 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని అన్నారు. హై క్యాలిటీ కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాను అభివృద్ధి చేస్తామని అన్నారు. అమరావతిని నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దుతామని, అందుకోసం మూడు మాస్టర్ ప్లాన్స్ అందించామని తెలిపారు.













