ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉగాదికి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. డీఏ 2.096 శాతం విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2017 జనవరి నుంచి 2018 మార్చి వరకు దాదాపు 15 నెలల డీఏ కోసం రూ.1048 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే పోలవరం కాంట్రీక్ పనులు చేపట్టిన నవయుగ కంపెనీకి రూ.1244 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు మంజురు చేశారు. అంతేకాకుండా విద్యాధరపురంలో ఉర్దూ జూనియర్ కాలేజీకి ఎకరా స్థలం కేటాయించారు. అలాగే ఏసీబీలో 350 పోస్టులు భర్తీ, గన్నవరం సీనియర్ సివిల్ జడ్డీజ కోర్టు 25 పోస్టుల భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
.













