ఎమ్మెల్సీగా అనంత ఉదయభాస్కర్ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎమ్మెల్సీగా అనంత ఉదయభాస్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంత ఉదయ భాస్కర్ చేత శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ తనకు శాసనమండలి సభ్యునిగా అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికి గుర్తింపు ఉంటుందని చెప్పడానికి తనకు మండలి సభ్యుత్వం ఇవ్వడమే నిదర్శనమని అన్నారు. పార్టీకోసం కష్టపడ్డవారికి సముచిత స్థానం కల్పించే వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పాల్గొన్నారు.













