అమరావతికి అంతర్జాతీయ ఖ్యాతి
న్యూయార్క్లో 2020లో జరిగే అంతర్జాతీయ ప్రదర్శన కోసం ప్రసిద్ధ మ్యూజియాల్లో ఉన్న అమరావతి, ఏపీ బౌద్ధ విశేషాలను సేకరించే పని చురుగ్గా సాగుతోంది. ఒకప్పుడు బౌద్ధమతాన్ని అక్కునచేర్చుకుని ఆదరించిన ఆంధ్రప్రదేశ్ చారిత్రక విశేషాలను ప్రపంచవ్యాప్తంగా అన్ని మ్యూజియాల నుంచి సేకరిస్తున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్తో న్యూయార్క్, మెట్రోపాలిటన్ మ్యూజియం ఆప్ ఆర్ట్ (మెట్) సౌత్, సౌత్ఈస్ట్ ఏషియన్ ఆర్ట్ క్యూరేటర్ జాన్ గయ్ ఫోన్లో మాట్లాడారు. నవంబరులో అమరావతిని సందర్శించి ముఖ్యమంత్రితో సహా ప్రముఖులకు ప్రదర్శన ఆహ్వానాలు అందజేస్తామని తెలిపారు.













