దేశంలో పెద్ద పార్టీ కావచ్చు.. రాష్ట్రంలో ఆ పార్టీ తుస్సే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తుస్సేనని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు విర్శించారు. ఆత్మకూరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన వైసీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండొచ్చు. దేశంలో పెద్ద పార్టీ కావచ్చు.. అయినా రాష్ట్రంలో ఆ పార్టీ తుస్సే అని అన్నారు. టీడీపీ పోటీ చేయనందునే వారు కనిపిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటే మీరు కనిపించరు. వారి సైజెంత, వారికి వచ్చిన ఓట్ల శాతమెంత? అని ప్రశ్నించారు. నన్ను ఏదో అనడం ద్వారా ప్రచారం పొందాలనే ఉబలాటం బీజేపీ నాయకుల్లో కనిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాధనంతోనే అభివృద్ధి పనులు చేపడతాయి అన్నారు. ఆదాయం తగ్గినా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.













