రాష్ట్రపతిని కలిసిన రాజధాని రైతులు
అమరావతి పరిరక్షణ సమితి ఐకాస, రాజధాని రైతులు ఢిల్లీ పర్యటన ఏడో రోజుకు చేరుకుంది. వారంతా తెలుగుదేశం పార్టీ ఎంపీతో కలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జోక్యం చేసుకునేలా కేంద్రానికి సూచించాని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా గత 52 రోజుగా రైతులు చేస్తున్న ఆందోళనను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అమరావతిలోనే రాజధాని కొనసాగేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని విన్నవించారు. రైతు, మహిళు, నిరసనకారుపై పోలీసు దాడులు చేస్తున్నారని వివరించారు.













