ఏపీ కేబినేట్ మొత్తం రాజీనామా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో 36 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. అనుకున్నట్లే జగన్ మంత్రివర్గ సహచరులంతా మూకుమ్మడిగా రాజీనామా సమర్పించారు. జగన్ నేతృత్వంలో త్వరలో రెండో కేబినెట్ కొలువు దీరనుండటంతో మొదటి కేబినెట్ చిట్టచివరి సమావేశంలో మంత్రిమండలిలోని 24 మంది మంత్రులూ రాజీనామా చేశారు. తమ రాజీనామాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సమర్పించారు. అనంతరం మంత్రులు తమ ప్రోటోకాల్ వాహనాలు వెనక్కి ఇచ్చారు. మంత్రుల రాజీనామా పత్రాలను సీఎం జగన్ గవర్నర్కు సమర్పించే అవకాశం ఉంది.













