ఈసారి మాత్రం తగ్గేది లేదు .. ఖచ్చితంగా పోటీ
రాజమహేంద్రవరం అర్బన్ నుంచి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి వాసు తెలిపారు. రాజమహేంద్రవరంలో టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ గతంలో కొన్ని సమీకరణాలతో తన భార్యకు ఎమ్మెల్యే సీటు ఇచ్చారన్నారు. అప్పుడు తాను తగ్గానని ఈసారి మాత్రం తగ్గేది లేదని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో మంచి పట్టు సాధించామని తెలిపారు. అదిష్ఠానం ఆదేశిస్తే తప్పదు కానీ మా ఆలోచన అర్బన్పైనే అని అన్నారు. 2024లో చంద్రబాబు సీఎం కావడం ఖాయమని అన్నారు. ఎంపీగా పోటీ చేసే ఆసక్తి లేదని, అంత ఓపికి కూడా లేదని తెలిపారు.













