ఇంటర్ పరీక్షలు అనివార్యమని గ్రహించండి : ఆదిమూలపు సురేశ్

షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ పునరుద్ఘాటించారు. ముందు ప్రకటించినట్లుగానే వచ్చే నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ, పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షలపై జాయింట్ కలెక్టర్లు, ఆర్‌ఐవో, డీఈవోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు రద్దు కాలేదని, ఇంటర్ పరీక్షలు అనివార్యమన్న విషయాన్ని అందరూ గమనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్ ప్రాక్టికల్స్‌ను అధికారులు సమర్థవంతంగా నిర్వహించారని మంత్రి ప్రశంసించారు.