సిట్ కాదు.. సీఎం విచారించినా భయం లేదు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనలో బస్సుపై జరిగిన దాడి ఘటనపై సిట్ విచారణతో పాటు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా విచారించినా మాకేమీ భయం లేదు. జరిగిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచటమే మాకు కావాలి అని తెలుగదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, తదితరులతో కలిసి విజయవాడలో మీడియాతో మాట్లాడారు. దాడి ఘటనపై కేంద్రానికి ఫిర్యాదు చేయబట్టే విచారణకు సిట్ ఏర్పాటు చేశారని అన్నారు. దాడికి పాల్పడిన వారు తెనాలి, కడప నుంచి వచ్చినట్టు ఒప్పుకున్నారని అన్నారు. రాజధాని తరలింపును నిరసిస్తూ, అమరావతి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ 5న అఖిలపక్ష నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగన్ వల్లే అమరావతి నిలిచిపోయిందని వర్ల రామయ్య ఆరోపించారు.











































































