ఇలాంటి శిబిరం.. చరిత్రలో ఇదే ప్రథమం

దేశ చరిత్రలో అధికార పార్టీ బాధితులకు పునరావాస శిబిరం ఏర్పాటు చేయడాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే చూస్తున్నామని శాసనసభలో టీడీపీ ఉప నాయకుడు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు వద్దకు వెళుతున్న అచ్చెన్నాయుడుతో పాటు మాజీ మంత్రి జవహర్, ఎమ్మెల్సీలు డి.రామారావు, జగదీశ్వరరావులను గుంటూరు జిల్లా, మంగళగిరి ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేసి, వేమూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పోలీసులు, రెవెన్యూ అధికారులు హడావుడిగా బాధితులకు బస్సులను ఏర్పాటుచేసి, వారిని గ్రామాలకు తరలించారని, అదేదో ముందే చేసి ఉండాల్సింది కదా అని ఆయన వ్యాఖ్యానించారు.











































































