రిమ్స్ లో కరోనా కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా రిమ్స్ వైద్య కళాశాలలో కరోనా కలకలం రేగింది. వైద్య కళాశాలలో 50 మంది వైద్య విదార్థులు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎన్టీఆర్ వర్సిటీ ఆధ్వర్యంలో రేపు ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. కళాశాలలో రేపు 150 మంది వైద్య విదార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 50 మంది వైద్య విదార్థులు కొవిడ్ బారిన పడగా, మరికొంత మంది విద్యార్థుల నివేదికలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రేపటి పరీక్షలు వాయిదా వేయాలని వైద్య కళాశాల యాజమాన్యం ఎన్టీఆర్ వర్సిటీని కోరింది. కొవిడ్ కలకలం రేగడంతో వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.