ఏపీ సైంటిస్ట్‌కు రూ.3.6 కోట్ల డెన్మార్క్ ఫెలోషిప్
అనంతపురం రేకులకుంట ఉద్యాన పంటల పరిశోధన స్థానం శాస్త్రవేత్త బాతినేని విమల(Bathineni Vimala) డెన్మార్క్ ప్రభుత్వ ఫెలోషిప్ (Fellowship)నకు ఎంపికయ్యారు. సదరన్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ (Southern University of Denmark)లో మూడేళ్ల కాలానికి ఆమెకు రూ.3.6 కోట్లు అందనున్నాయి. డెన్మార్క్‌లో సోయా (Soybean) దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఫావా బీన్స్ సాగుకు అనువైన ప్రాంతాలు గుర్తించడం, ఆ సాగుతో తలెత్తే పర్యావరణ, ఆర్థిక ప్రభావాలకు అంచనా వేసేందుకు ఈమె పరిశోధన చేయాల్సి ఉంటుంది.








