పట్టాభికి 14 రోజుల రిమాండ్ ..
తెలుగుదేశ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను తోట్లవల్లూరు పీఎస్ నుంచి విజయవాడ తీసుకొచ్చిన కోర్టులో హాజరుపర్చారు. సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పట్టాభికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పట్టాభిపై గతంలో అనేక కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించారు. అంతకు ముందు ప్రభుత్వాసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పట్టాభి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు నిరాకరించింది. పట్టాభిని మూడో అదనపు మెట్రో పాలిటన్ కోర్టులో ప్రవేశ పెట్టడంతో ధర్మాసనం ఆయనకు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. దీంతో పట్టాభిని పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు.













