ఇండో అమెరికా ఛాయ చిత్ర ప్రదర్శన
అమెరికా, భారత్ మధ్య నాటి నుంచి నేటి వరకు ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై మీడియా ప్లస్‌లో ఇండో అమెరికన్ ఫ్రెండ్షిప్ ఫొటో ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్, ఎంజీఎం, ఫొటోఫన్, గవాహ్ ఉర్దూ వీక్లీ సంయుక్తాధ్వర్యంలో గాంధీ, నెహ్రూ కాలం నుంచి నేటి దేశ ప్రధాని నరేంద్రమోదీ వరకు కొనసాగుతున్న ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు చెందిన చిత్రాలతో ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. అంతకుముందు ఎగ్జిబిషన్‌ను అసోసియేషన్ అధ్యక్షుడు గౌస్మోహినుద్ధీన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన చిత్రాలను తిలకించారు. అనంతరం మాట్లాడుతూ భారత్-అమెరికాల మధ్య నాటి నుంచి నేటి వరకు కొనసాగిన సంబంధాల్లోని కీలక ఘట్టాలను ఈ చిత్ర ప్రదర్శనలో ఉంచడం అద్భుతమన్నారు. అసోసియేషన్ సభ్యులు సయ్యద్ ఇఫ్తెకార్, షీమా ఖాన్, డాక్టర్ వాజిద్, పర్వేజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.













