ఐఎంఒ లో భారత్
అంతర్జాతీయ సముద్ర రవాణా రంగంలో వాణిజ్యం నిర్వహించడానికి ఉపయోగపడేఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంఒ)లో భారత్ పున:ప్రవేశించనున్నది. దీనికోసం జరిగిన ఎన్నికలో భారత్ అత్యధిక సంఖ్యలో ఓట్లను పొంది రెండవ స్థానం సాధించింది. కేటగిరి-బిలో స్థానం సంపాదించడం వల్ల ఎంతో ఆనందాన్ని పొందామంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. జర్మనీకి 146 ఓట్లు రాగా, భారత్ 144 ఓట్లతో రెండవ స్థానం పొందిందని గడ్కరీ తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ సముద్ర రవాణా రంగంలో వాణిజ్యం నిర్వహించడానికి ఐఎంఒ కేటగిరి బి ఉపకరిస్తుంది.













