త్వరలో …తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు!
తెలుగు రాష్ట్రాలకు త్వరలో ఇద్దరు కొత్త గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విషయమై చర్చించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలపాటు సుధీర్ఘంగా భేటీ జరిగింది. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించే అంశంపై నిశితంగా చర్చించారు. అనంతరం తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అయితే కొత్త గవర్నర్లు నియామకం ఎప్పుడు జరుగుతుంది? తెలుగు రాష్ట్రాలకు కొత్తగా వచ్చే గవర్నర్లు ఎవరు? ఇప్పుడున్న గవర్నర్ నరసింహన్ను తెలంగాణకు లేదా ఏపీ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమిస్తారా? లేకుంటే ఇద్దర్నీ కొత్తవారినే కేంద్రం నియమిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.













