మతోన్మాదానికి వ్యతిరేకంగా కలం జులిపించిన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య
మతోన్మాదానికి వ్యతిరేకంగా, పేదల కోసం పోరాడిన పాత్రికేయురాలు
కర్ణాటక రాజధాని బెంగళూరు లో మతోన్మాదానికి వ్యతిరేకంగా కలం జులిపించిన సీనియన్ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్(55)ను కొందరు దుండగలు కాల్చి చంపారు. కల్బుర్గి హత్య జరిగిన రెండేళ్లలో అదే తరహాలో తాజా సంఘటన జరగడం సంచలనం సృష్టించింది. దుండగులు ఆమెను నివాసంలోనే హత్య చేశారు. గౌరీ లంకేష్ హత్యను దేశ వ్యాప్తంగా పాత్రికేయ సంఘాలు, సీనియర్ పాత్రికేయలతో పాటు, పలువురు రాజకీయ నేతలు ఖండించారు. దుండగులు అతి సమీపం నుంచి మూడు రౌండ్లుకాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.గుర్తు తెలియని వ్యక్తులు గౌరీ లంకేశ్‌ను చంపారని పోలీసులు చెబుతున్నప్పటికీ ఈ హత్య వెనుక RSS సంఫ్‌పరివార్ శక్తులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి.
“లంకేష్ పత్రికె “అనే కన్నడ వార పత్రిక ను ఆమె స్వతంత్రంగా నిర్వహించడమేగాక, ఎడిటర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా తను చెప్పదల చిన అంశాన్ని ముక్కుసూటిగా చెబుతారనే పేరు పొందడంతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందారు. బిజెపి నేతల మతోన్మాద రాజకీయాలకు వ్యతిరే కంగా ఆమె గళం విప్పారు.
ప్రముఖ హేతువాది ఎం.ఎం.కల్బుర్గి హత్యను నిరసిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఆమె ఉద్యమాన్ని ప్రారంభించారు. సంఫ్‌పరివార్ శక్తులను దనుమాడుతూ పలు వ్యాసాలు రాశారు. మత ఘర్షణలను విమర్శిస్తూ బహిరంగ వేదికలపై ప్రసంగించారు. సైద్ధాంతిక విభేదాలున్నవారు సామాజిక మాధ్యమాలు, చర్చావేదికల్లో తరుచుగా ఆమెపై మాటల దాడి చేసేవారు. అయితే ఆ ద్వేషం ఇలా హత్యకు దారి తీస్తుందని అనుకోలేదని తోటి పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. గౌరీ హత్యను నిరసిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తాయి.
గౌరీ లంకేశ్ హత్య ను ప్రజాస్వామిక వాదులు, రచయితలు, కవులు,కార్మిక సంఘాలు ముక్తకంఠంతో ఖండించాలి..!!
గౌరీ లంకేశ్ ను హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలి..!!













